టీఎస్ఏసీఎస్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
తెలంగాణలో టీఎస్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TS AIDS Control Society) నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్‌టీడీ కంట్రోల్ ప్రొగ్రాం ఆధ్వర్యంలో నడుస్తోంది. తాజాగా టీఎస్ఏసీఎస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది.
- By Arkaan --
- Sunday, 13 Mar, 2022
తెలంగాణలో టీఎస్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TS AIDS Control Society) నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్‌టీడీ కంట్రోల్ ప్రొగ్రాం ఆధ్వర్యంలో నడుస్తోంది. తాజాగా టీఎస్ఏసీఎస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐసీటీసీ కౌన్సిలర్, డీఎస్ఆర్‌సీ కౌన్సిలర్, ఐసీటీసీ ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయసు 60 ఏళ్లుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదిక నియమిస్తారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. నోటిఫికేషన్ సమాచారం, దరఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ https://tsacs.telangana.gov.in/ ను సందర్శించాలి. దరఖాస్తుకు మార్చ్ 31, 2022 వరకు అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు..
పోస్టు పేరు | అర్హతలు | వేతనం | ఖాళీలు |
ఐసీటీసీ కౌన్సిలర్, | సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి. అంతే కాకుండా సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. | రూ. 13,000 | 16 |
డీఎస్ఆర్‌సీ కౌన్సిలర్ | సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి. అంతే కాకుండా సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. | రూ. 13,000 | 10 |
ఐసీటీసీ ల్యాబ్ టెక్నిషియన్ | బీఎస్సీ (మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్)లో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. | రూ. 13,000 | 08 |
ఎంపిక విధానం..
- ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tsacs.telangana.gov.in/ ను సందర్శించాలి.
Step 3 - అనంతరం నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.
Step 4 - ఆసక్తిగల వారు నోటిఫికేషన్ చివరన ఉన్న దరఖాస్తు ఫాం డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Step 5 - తప్పులు లేకుండా దరఖాస్తు ఫాం నింపాలి.
Step 5 - అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి నోటిఫికేషన్‌లో రిజయన్ వారీగా పేర్కొన్న అడ్రస్‌లలో దరఖాస్తులను సబ్‌మిట్ చేయాలి.
Ste[ 6 - కార్యాలయాల్లో దరఖాస్తులు అందించేందుకు మార్చ్ 31, 2022 వరకు అవకాశం ఉంది.