అక్రమ గంజాయి రవాణా ముఠా అరెస్ట్...

గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ నిషేధిత పొగాకు గంజాయి,గుట్కా,పాన్ మసాలా లాంటి పదార్దాలను అక్రమ రవాణా జరగకుండా నల్లగొండ జిల్లా పోలీసులు నిరంతరం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారని జిల్లా యస్.పి గారు తెలిపారు.

*ప్రభుత్వ నిషేధిత గుట్కా మరియు అక్రమ గంజాయి రవాణా చేస్తున్న నేరస్తులను అరెస్ట్ చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు.* జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి IPS. * గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటు నిరంతర నిఘా * సుమారు 5 లక్షల రూపాయల విలువ గల 15 బస్తాల గుట్కాస్వాధీనం. * సుమారు 3.5 లక్షల 30 కిలోల గంజాయి స్వాధీనం. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ నిషేధిత పొగాకు గంజాయి,గుట్కా,పాన్ మసాలా లాంటి పదార్దాలను అక్రమ రవాణా జరగకుండా నల్లగొండ జిల్లా పోలీసులు నిరంతరం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారని జిల్లా యస్.పి గారు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గతంలో నిషేధిత గంజాయి,గుట్కా, పాన్ మసాల వంటి వాటిని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ క్రమంలో తేదీ 28.03.2022 రోజున ఉదయం కేతేపల్లి మరియు కట్టంగూర్ పోలీస్ సిబ్బంది రెండు వేరు వేరు చోట్ల తనిఖీ చేసి నేరస్తులతో పాటు గంజాయిని స్వాదిన పరుచుకొనైనది. మొదటి కేసు వివరాలు : ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభూభాకర్ అను అతనికి హైదరాబాద్ కు చెందిన గంజాయి సరఫరా చేసే కాట్రవత్ రాజు @ శివ అను అతను పరిచయం అయినాడు, అతని ద్వారా అబూబఖర్ హైదరాబాద్ నుండి ఉత్తరప్రదేశ్ కు గంజాయి ని తీసుకొని పోయి తెలిసిన వారికి అమ్ముకొనే వాడు, ఇదే క్రమంలో కాట్రవత్ రాజు @ శివ సూచనల మేరకు అబూబఖర్ ఒడిస్స రాష్ట్రం లోని మాల్కంగిరి పరిసర ప్రాంతాలలో కాట్రవత్ రాజు @ శివ కు తెలిసిన వ్యక్తుల వద్ద నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగులో చేసి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుండి ఉత్తరప్రదేశ్ కు వెళ్ళుటకు బస్ లో ప్రయాణిస్తుండగా మార్గమద్యలో తేదీ 28.03.2022 ఉదయం 4 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు బస్సును కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద పోలీస్ వారు వాహనాలు తనికి చేస్తుండగా పోలీస్ వారిని చూసి అబూబఖర్ bus దిగి పారిపోతుండగా పోలీస్ వారు పట్టుకొని విచారించగా అతని వద్ద నుండి 17 కె.జి ల గంజయీని స్వాదినం చేసుకోని కేతేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు పరచనైనది. కాట్రవత్ రాజు @ శివ పరారీలో ఉన్నాడు రెండవ కేసు వివరాలు : ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా, కలిమెల ప్రాంతానికి చెందిన గోవర్ధన్ డార్లి @ సోనాలీ @ సోనూ అనే ట్రాన్స్ జెండర్ తమ ప్రాంతంలో దొరికే గంజాయిని తక్కువ దరకు కొనుగోలు చేసి RTC బస్ లలో హైదరాబాద్ తీసుకోవచ్చి హైదరాబాద్ లో కావలిసిన వారికి ఎక్కువ దరకు అమ్ముతుంటారు, ఇదే క్రమంలో తేదీ 28-03-2022 రోజు గోవర్ధన్ డార్లి @ సోనాలీ @ సోనూ తమ ప్రాంతం నుండి గంజాయి తీసుకొని బస్ లో హైదరాబాద్ తీసుకొస్తుండగా మార్గమద్యలో ఉదయం 7 గంటల సమయంలో నల్గొండ X రోడ్డు వద్ద కట్టంగూర్ పోలీస్ వారు వాహనాలు తనికి చేస్తుండగా పోలీస్ వారిని చూసి గోవర్ధన్ డార్లి @ సోనాలీ @ సోనూ bus దిగి పారిపోతుండగా పోలీస్ వారు గోవర్ధన్ డార్లి @ సోనాలీ @ సోనూ పట్టుకొని విచారించగా అతని వద్ద నుండి 13 కె.జి ల గంజాయిని స్వాదినం చేసుకోని కట్టంగూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు పరచనైనది. *నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ తేదీ 28.03.2022 రోజున టాస్క్ఫోర్స్ సిబ్బంది మరియు 2 టౌన్ పోలీస్ సిబ్బంది కలిసి నమ్మదగిన సమాచారం ప్రకారం బాపనపల్లి అంజనేయులు S/O కోటేశ్వరరావు హాలియ కు చెందిన వ్యక్తి ప్రభుత్వ నిషేధిత గుట్కా తీసుకొని యాక్టివా బండి పై నల్లగొండ పట్టణములో లైన్ వాడ స్టార్ పంక్షన్ హాల్ దగ్గర నుండి వెళ్లే క్రమంలో ఇతనిని చెక్ చేయగా అతని వద్ద నిషేధిత గుట్కా ఉండడం గమనించి అదుపులోకి తీసుకొని విచారించగా ఇతను వి.టి కాలనీకి చెందిన ఈర్లపాటి యాదగిరి S/O వెంకటేశ్వర్లు దగ్గర నుండి ఇట్టి ప్రభుత్వ నిషేధిత గుట్కాను తీసుకొని వస్తున్నానని ఒప్పుకోవడం జరిగింది. వెంటనే యాదగిరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ యొక్క గుట్కాను కర్ణాటకలోని బీదర్ నుండి తెచ్చినాను అని తెలపి ఈ గుట్కాలు తన స్నేహితుని యొక్క టాటా వాటర్ గోడౌన్లో నిల్వవుంచినట్లు ఒప్పుకోవడం జరిగింది. అక్కడికి వెళ్లి చెక్ చేయగా ప్రభుత్వం నిషేధిత గుట్కా 15 బస్తాలు గుట్కా సుమారు 5లక్షల విలువ గల స్వాధీనం చేసుకుని రిమాండుకు పంపడం జరిగింది. వీరి పైన గతంలో కూడా కేసులు కలవు. యాదగిరి అనే వ్యక్తి పైన 2019 సంవత్సరంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ నల్లగొండ నందు 2020 సంవత్సరంలో అంజనేయులు పైన హాలియ పోలీస్ స్టేషన్లో కేసులు కలవు. వీరి వద్ద నుండి స్వాధీన పరుచుకున్న వివరాలు * 7 1/2 బస్తాల RR Tobacco * 7 1/2 బస్తాల Blue Bull Tobbacco * 2 జోడబైల్ చిన్న బస్తాలు Blue Bull Tobacco * TS05 FD 7313 Activa బండి * 1 vivo ఫోన్ * 1 సమ్సంగ్ ఫోన్ వీటి యొక్క విలువ మొత్తం 6 లక్షలు రూపాయలు. ఈ కేసులు చాకచక్యంగా పట్టుకున్న శ్రీ వెంకటేశ్వర రెడ్డి, డి. యస్.పి , నల్గొండ గారి పర్యవేక్షణలో శాలిగౌరారం సి.ఐ ఎస్. రాఘవ రావు, 2 , టౌన్ సి.ఐ చంద్రశేఖర్ రెడ్డి యస్.ఐ రాజేశేఖర్ రెడ్డి కేతేపల్లి యస్.ఐ అనిల్ రెడ్డి , కట్టంగూర్ యస్.ఐ విజయ్ సిబ్బంద టాస్క్ఫోర్స్ సి.ఐ బాలగోపాల్ యస్.ఐ శివ కుమార్ మరియు సిబ్బందిని అభినందించారు.

khaja

Comment As:

Comment (0)